సీనియర్ రజక సంఘం నాయకుడు ఎనగందుల లక్ష్మణ్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 22 మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలో రజక సంఘం అధ్యక్షత నియామకంలో బాగంగా మండలం లోని కొత్తకొమ్ముగూడెం, పాతకొమ్ముగూడెం,దౌడేపల్లి గ్రామాలలో రజక సంఘం గ్రామ కమిటీలు సీనియర్ రజక సంఘ నాయకులు ఎనగందుల లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నూతన కమిటీలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ రోజు అధ్యక్షత పదవులు తీసుకుని రజక సంఘానికి,సాయం చేస్తూ వారి గ్రామంలోని సమస్యలను, పరిష్కరించాలని రాబోయే రోజుల్లో రజక సంఘానికి మేలు చేస్తూ,రజక సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.అంతేకాకుండా మండల రజక సంఘానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గుండారపు భీమన్నా నేరెళ్ల సురేష్.ఒరగంటి బాపన్న,ఆల్వాల రవి, మందపల్లి లక్ష్మణ్,నస్పూరి గణేష్ పాల్గొన్నారు.