నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలకు పర్మిషన్ ను ఇవ్వకూడదు ఐక్య విద్యార్ధి సంఘాలు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలకు పర్మిషన్ ఇవ్వకుడదని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ… లక్షెట్టిపేట పట్టణంలో కనీస సౌకర్యాలు లేకుండా సినిమా టాకీస్ పక్కన,చెరువులో ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలకు పర్మిషన్ ఇవ్వకూడదన్నారు.ఇట్టి పాఠశాలకు పర్మిషన్ ఇస్తే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్ధి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, టివియూవి రాష్ట్ర కార్యదర్శి జుమ్మిడి గోపాల్,ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ కెసల్మాన్,రాష్ట్ర ఉపాధ్యక్షులు బచ్చలి ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.