బంగారు,రజత పతకాలు సాధించిన ఎం జె పి క్రీడాకారులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 01 : బంగారు,రజత పథకాలు సాధించిన ఎం జె పి క్రీడాకారులు మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలకు చెందిన క్రీడాకారులు ఒక బంగారు పతకం తో పాటు 10 రజత పథకాలు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గౌతమ్ కుమార్ రెడ్డి తెలిపారు.జనవరి 31న మంచిర్యాల జిల్లా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలుసీసీసీ నస్పూర్ లోని సాధన గ్రూప్స్ పాఠశాలలో నిర్వహించారు.అథ్లెటిక్స్ మీట్ లో మహాత్మా జ్యోతిభాఫూలే లక్షెట్టిపేట విద్యార్థులు.రిత్విక్ 6వ తరగతి లాంగ్ జంప్ అండర్ 10 లో బంగారు పథకం సాధించా డు.అలాగే అఖిల్,రిషిక్ వర్మ,6 వ తరగతి రజత పథకాలు సాధించారు.అండర్ 10 లో రేలా 4×100 లో రిషిక్ వర్మ, సిధార్థ,అన్వేష్,అఖిల్, రజత పథకాలు సాదించారు.అండర్ 12 విభాగంలో అంజన్న,రంజిత్, మణిరజ్,సిద్దు,రజత పథకాలు సాధించారు.లాంగ్ జంప్ బంగారు పథకం సాధించిన రిత్విక్ 6 వ తరగతివిద్యార్థి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్టు తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీనభద్రాద్రి కొత్తగూడెం లో నిర్వహించే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ మీట్ లో పాల్గొంటా రని చెప్పారు.పథకాలు సాధించిన క్రీడాకారులను ప్రిన్సిపాల్ గౌతమ్ కుమార్ రెడ్డి,ఏటీపీ సునీత,పీడీ రాజేష్,పి ఇ టీ కార్తీక్, ఉపాధ్యాయులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking