పెద్దంపల్లి గౌడ సంఘం సభ్యులు పోచమ్మ తల్లి గుడికి 10,016 లు విరాళం.

జమ్మికుంట మండలం ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 1 మండల పరిధిలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన గౌడ సంఘం సభ్యులు అందరూ కలిసికట్టుగా ఆ ఊరి గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లి గుడికి ₹10,016 లు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచమ్మ తల్లి గుడికి విరాళం ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నామని ఆ తల్లి మమ్మల్ని ,ఈ గ్రామాన్ని ఎల్లవేళలా చల్లగా చూడాలని అంటూ గౌడ సంఘం సభ్యులు అయినటువంటి పూదరి శ్రీనివాస్, ఓదేలు, పూదరి మొగిలి అమ్మ వారి గుడికి విరాళాన్ని గ్రామ పెద్దలు మోహన్ రెడ్డి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో పూదరి శీను, ఓదెలు, మొగిలి, పూదరి రాజు, రాజేందర్, సాయిలు, తిరుపతి, పాణి, సదానందం, మారపల్లి రాజయ్య, మల్లారెడ్డి, మోహన్ రెడ్డి, దుర్గాప్రసాద్, పరిషయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking