పెరుక కులస్తుల పై కెసిఆర్ చిన్న చూపు చూడడం సరి కాదు పెరుక సంఘం యూత్ జిల్లా అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్
మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 16 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ స్థానిక ఐబీ లో పెరుక సంఘం జిల్లా అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్ కెసిఆర్ పెరుక కులస్తుల పై కెసిఆర్ చిన్న చూపు చూడడం సరి కాదు అని అన్నారు. శుక్రవారం ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పెరుక కులస్తుల పై కెసీఆర్ చిన్న చూపు చూడడం సరి కాదు అంతేకాకుండా కొత్తగా కెసిఆర్ బీసీ కులాలు 15 కులాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం గురించి దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించారు దానిలో మా పెరుక కులం పెరు లేకపోవడం శోచనీయం ఈ విషయంలో కెసిఆర్ పెరిక కులస్తులపై చిన్నచూపు చూడడం తగదని హెచ్చరిస్తున్నాము.అంతేకాకుండా యాదవ్,గౌడ్స్,మున్నురు కాపు,బెస్త, పద్మశాలి,యాదవ,కులల వారికి కూడా వెంటనే దరఖాస్తు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. దీనిలో రాందేని చిన్న వెంకటేష్,పెరుక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.