బద్దంసతీష్‌గౌడ్ , శంకర్ ,చారీ
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: సోమ వారం హైదరాబాద్ లక్డీకపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి ని ప్రజావాణి కార్యక్రమంలో గోషామహల్ నియోజకవర్గం గంఫౌండ్రీ డివిజన్‌లోని బషీర్బాగ్ పూలబాగ్ ప్రాంతంలో జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం స్కీం ద్వారా దాదాపు 608 గృహలను నిర్మించడం జరిగింది.కానీ నేటీ వరకు లబ్దిదారులకు పట్టాలు ఇవ్వలేదు.తక్షణమే ఎదురు చూస్తున్న లబ్దిదారులకు న్యాయం చేయాలని గోషామహల్ నియోజకవర్గం డెవెలప్మెంట్ ఫోరమ్ కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకుడు బద్దం సతీష్ గౌడ్ పూలబాగ్ సంక్షేమ సంగం ప్రెసిడెంట్ శంకర్ సోషల్ వర్కర్ చారీ కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది.కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.అని తెలిపారు.