ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా కేంద్రంలో జనతా పార్టీ కిసాన్ మోర్చా అకాల వర్షాలకు నష్టపోతున్నటువంటి పంటలను అంచనా వేసి వాటికి నష్టపరిహారం రైతులకు చెల్లించాలని గత నెలలోనే బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. కానీ ఇంతవరకు పంట నష్టపరిహారం దేవుడెరుగు కనీసం నష్టపోయిన పంటల లిస్ట్ కూడా తయారు చేయలేని అసమర్ధ ప్రభుత్వాన్ని మేము నిలదీయడం అట్లాగే రైతులకు రుణమాఫీ లక్ష రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది. ఇంతవరకు రైతుకు రుణమాఫీ చేయకపోవడం సిగ్గుచేటన విషయమని తెలియజేసుకుంటున్నాం.మరియు ఉన్నపళంగా మొక్కజొన్న ధరలు క్వింటాల్కి.1000 రూపాయల దిగువన చేరిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర అయినా 1960 రూపాయలు చెల్లించి రైతుల వద్ద నుంచి మొక్కజొన్న కొనుగోలు జరపాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరియు వరి పొలాలు 20 శాతం పూర్తి కూడా ఆవ్వడం జరిగింది. మరి మొక్కజొన్న మరియు వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి దాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి కిసాన్ మోర్చా డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముత్యం రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి లింగారెడ్డి, పార్లమెంటు కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మె రాజు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు అలివేలు మంగ, దళిత మోర్చాజిల్లా అద్యక్షుడు రాచకొండ సాగర్, రాష్ట్ర ఓబిసి అధికార ప్రతినిధి అమారవెని నర్శ గౌడ్, మండల అధ్యక్షులు సోన్నపేట గంగారెడ్డి,నరసయ్య, దువ్వెందర్ రెడ్డి,ముత్యం రెడ్డి, లింగన్న, పట్కురి లింగారెడ్డి, దేవన్న,మండల అద్యక్షులు ఠాకూర్ అర్జున్ మరియు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.