మన సిరిసిల్లలో పోషణ్ అభియాన్ 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా 27,ఏప్రిల్ 2023, ప్రజాబలం ప్రతినిధి గెంట్యాల ఆంజనేయులు. మన సిరిసిల్లలో “పోషణ్ అభియాన్ ” సిరిసిల్ల అర్బన్ లోని సుభాష్ నగర్ సెక్టార్ లో గల 25 అంగన్వాడీ కేంద్రాలు సెంటర్ పరిధిలోని గర్భిణీల కు శ్రీమంతాలు మరియు ప్రీస్కూల్ పిల్లలకు వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి స్ధానిక వార్డు కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న 17 వ వార్డు కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్ మాట్లాడుతూ పిల్లలు మరియు గర్భవతి గా ఉన్న తల్లులు మంచి పోషకాహారం తో కూడిన ఆహార పదార్థాలు, పండ్లు, పాలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు లాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకోవడం వలన పుట్టే పిల్లలు మంచి ఆరోగ్యవంతంగా పుట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే పుట్టిన పిల్లలకు వెంటనే తల్లి యొక్క ముర్రు పాలు బిడ్డకు పట్టించాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఎదుగుతున్న పిల్లలకు మంచి పోషకాహారం అందించాలని తెలిపారు. ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్త్రీ శిశు సంక్షేమ కోసం ఎన్నో మంచి కార్యక్రమాలను తీసుకు రావడం జరిగింది. అలాగే మన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆద్వర్యంలో మన జిల్లాలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్ , సీడీపీఓ ఆలేఖ్య , సూపర్ వైజర్ దివ్య , అంగన్వాడీ టీచర్స్ కల్లూరి చందన, ఎదురుగట్ల మమత, మంజుల, సునీత, నాగలక్ష్మి, సురేఖ, జ్యోతి, భాగ్య, అన్నపూర్ణ, మహేశ్వరి, వనజ, జ్యోతి, విజయలక్ష్మి మరియు ఆయాలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking