ఐకేపి విఓఏల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి భాజపా నాయకులు రామారావు పాటిల్

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఐకెపి వివోల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ముధోల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు రామారావు పాటిల్ అన్నారు. మండల కేంద్రంలో గత తొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఐకెపి-విఓఏల ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామస్థాయిలో విఓఏలు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని వారికి కనీస వేతనంగా రూ.26 వేల వరకు ఇవ్వాలని, ఐకెపి విఓఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు.అదే విధంగా రూపాయలు 10 లక్షల వరకు సాధారణ ఆరోగ్య భీమా సౌకర్యం కూడా కల్పించాలని, అర్హులైన విఓఏలను సిసిలుగా ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలన్నీ పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ ముధోల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి, బాలాజీ పటేల్, యాదవ్ రావు పటేల్, తాటివార్ దశరథ్, తటివార్ రమేష్, ధర్మపురి శ్రీనివాస్, గోసుల రాజు బాలు, గంగాధర్,రాజు, విఓఏల సంఘం అధ్యక్షులు రాజు, కేర్భ,శ్రీలత, సాయినాథ్, సరిత,జ్యోతి,లత, జయశ్రీ, స్వప్న,శోభ, రాధ, గంగాధర్, తదితరులు, పాల్గొన్నారు.*

Leave A Reply

Your email address will not be published.

Breaking