బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 27 : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరిట జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని గురువారం స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ…రైతులకు కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అన్యాయాలను అరికట్టెందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు అండగా బిజెపి నాయకులు ఉంటారన్నారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుకు రసీదు ఇవ్వాలన్నారు. కొనుగోలు పేరుతో రైతుల వద్ద బస్తా కు రెండు కిలలు అదనంగా కాంటా పట్టి రైస్ మిలర్లతో ఎమ్మెల్యే కుమ్మకై రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని ఎమ్మెల్యే దివాకర్ రావు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో కమిషన్లు దోచుకుని భూ నిర్వసితులకు మాత్రం ఇప్పటికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ముంపు గ్రామాలకు ఎమ్మెల్యే వెళ్తే ప్రజలు తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు.దివాకర్ రావు ఇప్పటికైనా ప్రజలకు న్యాయం చేయకపోతే వారి కన్నీరు నిన్ను అనంత లోకాలకు తొక్కేస్తుంది జాగ్రత్త అని సూచించారు.ఈ కార్యక్రమం లో లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాల్, లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, మండలాల ఇంచార్జ్ గుండ ప్రభాకర్,శ్రీదేవి, మధు,గంగన్న,సతీష్,రమేష్,శేఖర్,రవి లు పాల్గొన్నారు.