అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకం దారుల సమస్యలపై మంత్రి పొంగులేటి కి వినతి

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి03 (ప్రజాబలం) ఖమ్మం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కురుమ యాదవుల గొర్రెల పెంపకం దార్ల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్, జిల్లా యాదవ ఉద్యోగుల అధ్యక్షులు దుబాకుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ప్రకటించినట్లుగా గొర్రెల పెంపకం దారులకు నగదు బదిలీ చేయాలని యాదవుల కు చట్టసభలలో జిల్లా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని, రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో యాదవులకు సముచితమైన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఆ ప్రకటించాలని ఎన్సీడీసీ స్కీమును పునరుద్ధరించాలని గత ప్రభుత్వం ఎస్ ఆర్ డి పి పథకాన్ని రెండో విడత ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిందని ఆగిపోయిన వారికి స్కీమును కొనసాగించాలని కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాలకు గొర్రెలకు బదులు పాడి గేదెలు మంజూరు చేయాలని తదితర సమస్యలపై మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, దీనికి మంత్రి గారు సానుకూలంగా స్పందించి అతి తొందరలో సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేతుల నాగేశ్వరరావు మొరి మేకల కోటయ్య కనక బండి విజయలక్ష్మి
బమ్మిడి శ్రీనివాస్, నన్నే బోయిన పద్మ,, తుప్పాత్ రవికుమార్ కురుమ, ముత్తయ్య కురుమ, గజ్జి సూరిబాబు యాదవ్ అంగడాల నరసింహారావు, మంద నాగేశ్వరరావు జాల నరసింహారావు పొదిలి సతీష్ బండారు ప్రభాకర్, వాకదాని కోటేశ్వరరావు బొల్లి కొమరయ్య జోనబోయిన పాపయ్య, పొదిలి భూపతి తోడేటి లింగరాజు మారుతి ఎట్టయ్య, కాసు మల్లేష్ మేడిదల మల్లేష్ రాగం బాబురావు, సత్తి వెంకన్న మెండే వెంకటేష్, రాధాకృష్ణ యాదవ్ మరియు తదితర యాదవ నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking