కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

నిరసన తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 3

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరసన తెలుపుతూ సోమవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బిజెపి కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, సొత్కు సుదర్శన్, పుల్లూరు లక్ష్మణ్, పైడిమల్ల నర్సింగ్,మంద తిరుమలరెడ్డి లు పత్రికా, మీడియా ముందు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేవలం కేంద్రం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల మీదనే ఆసక్తి చూపడం విచిత్రం. ఇక్కడే తెలిసింది తెలంగాణ రాష్ట్రం అంటే ఎంత చిన్న చూపు.ఎనిమిది మంది ఎంపీలు,ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్రం కు న్యాయం చేయకుండా బడ్జెట్ రాకుండా చేసిన కేంద్రానికి హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక తెలంగాణ అభివృద్ధి పథంలో పోవడాన్ని జీర్ణం చేసుకోలేక చేతగాక ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నెరువట్ల శీను, ఎర్ర రాజు, ఆంజనేయులు, నర్సోజి ప్రభాకర్, జమీల్,గణేష్ ,రంజిత్ శ్రీను, వేణు, రాంబాబు, ప్రదీప్, రవి, రాము, కృష్ణ, గట్ల సారంగపాణి, యువజన నాయకులు రాయబారపు కిరణ్, బియ్యపు రవి కిరణ్ , వడ్లకొండ సునీల్, రాజేష్, శేఖర్, ఉదయ్, సురేందర్,గణేష్ సూరజ్, రాజు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking