ఫిబ్రవరి 6లోపు ప్రకటించకుంటే తాడో పేడో
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపొర్టర్
పిబ్రవరి 3:
ఈనెల 7న హైదరాబాదులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్ తో సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో లక్ష డప్పులు వేల గొంతుల’తో మాదిగల మహాత్తర సాంస్కృతిక ప్రదర్శన పోస్టర్లను కరపత్రాలను సోమవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్, ఆది జాంబవ సంఘం చెన్నూరు మాదిగ యూత్ అసోసియేషన్ నాయకులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా మాదిగ మరియు ఇతర ఎస్సీ కులాలకు తీరని ద్రోహం, మోసం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో లక్ష డప్పుల ‘లాంగ్ మార్చ్’జరగబోతున్నద న్నారు. ఇది ప్రపంచచరిత్రలో మునుపెన్నడూ జరగని అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమం అని అందుకు మాదిగలు ఇతర ఎస్సీ కులాలు డప్పులు,ఇతర వాయుద్యాలతో సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ముప్పై ఏండ్లుగా సామాజిక న్యాయం కోసం మాదిగలు చేస్తున్న పోరాటానికి అన్ని కులాలు తమ సంఘీభావం ప్రకటించడమే కాకుండా పాలుపంచుకుంటున్నాయని ఇకనైనా స్వార్థపరుల మాటలు నమ్మకుండా ఫిబ్రవరి 7 లోగా ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకై ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో వేల గొంతులు లక్షడప్పులు తో భూమి ఆకాశం దద్దరిల్లేలా ప్రపంచానికే మాదిగల గోడు వినబడేలా మహాత్తర ప్రదర్శన జరగబోతోందని గుర్తు చేస్తూ అందుకు మాదిగలు ఇతర కులాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జీడి సారంగం మాదిగ, గొల్లపల్లి ఓదెలు మాదిగ, మిట్టపల్లి బాపు మాదిగ, సప్పిడి శ్రీనివాస్ మాదిగ, ఆది జాంబవ సంఘం అధ్యక్షులు కంబాల రాజనర్సు మాదిగ, ప్రధాన కార్యదర్శి దాసరి రాజనర్సు మాదిగ, ఇరుగురాల వెంకటి మాదిగ, అధికార ప్రతినిధి ఉప్పులేటి నరేష్ మాదిగ, చెన్నూరు మాదిగ యూత్ అధ్యక్షులు మంతెన సుమన్ మాదిగ, నాయకులు కాంపెల్లి శ్రీనివాస్ మాదిగ శనివారపు రాజకుమార్ మాదిగ చొప్పదండి స్వామి మాదిగ, పసుల మహేష్ మాదిగ లు పాల్గొన్నారు.