ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ తపస్ ఆద్వర్యంలో ఆర్డీఓ కు వినతి పత్రం.

తూప్రాన్,31/7/23అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల సాధనకై తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్రవ్యాప్తంగా ” ఉపాధ్యాయ ఉద్యమ జాగరణ” పేరుతో ఇచ్చిన పిలుపుమేరకు తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ అధికారికి మెదక్ జిల్లా తపస్ కార్యవర్గం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ
పిఆర్సీ కమిటీని వేసి, మధ్యంతర బృతిని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న అన్ని డి.ఏలను వెంటనే విడుదల చేయాలని, సి.పి.ఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు అవకాశం కల్పించాలని, పండిత్, పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, కే.జీ.బీ.వీ ఉపాధ్యాయునిల, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలల, గిరిజన సంక్షేమ పాఠశాలల, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర బాద్యులు ఆర్ వి రామారావు తపస్ జిల్లా బాద్యులు మనోహర బాద్, మసాయి పేట, తూప్రాన్ తపస్ మండలల అధ్యక్షులు నాగిరెడ్డి, రంగా రెడ్డి, భాను ప్రసాద్,తుప్రాన్ తపస్ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్, కోలా వేణు, ఉమా దేవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking