– సంఘీభావం తెలిపిన
పల్నాడు జిల్లా: ఫిబ్రవరి15, (గురజాల నియోజకవర్గం / దాచేపల్లి మండలం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాచేపల్లి మండలంలో సైకిల్ యాత్ర ప్రారంభం…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజును పురస్కరించుకుని వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో… కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి (తిరుమల తిరుపతి వెంకన్న దేవస్థానం) వరకు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామం పీవీ నరసింహారావు కాలనీ నుండి, చెందిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, బీ ఆర్ ఏస్ పార్టీ జిల్లా నాయకుడు పిడిశెట్టి రాజు సైకిల్ యాత్ర చేపట్టగా… సీఎం కేసీఆర్ కి ఇష్ట దైవం అయిన కొనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బయలు దేరగా.. గత ఐదు రోజులుగా చేస్తున్న సైకిల్ యాత్ర ఈ ఉదయం దాచేపల్లి మండలం చేరుకోగా యాత్ర కి పలువురు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో ,బంగారు తెలంగాణ నిర్మాణంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు మంచి జరగాలని, వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని రాజు ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు. అదేవిధంగా గతంలో రాష్ట్రం ఏర్పడిన నుండి నేటివరకు కేసీఆర్ ప్రతి పుట్టిన రోజు వేములవాడ నుండి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర ,సైకిల్ యాత్ర చేశామని రాజు తెలియజేశారు. ఈకార్యక్రమంలో దాచేపల్లి మండల ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.