రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీమతి శ్వేతా మహంతి జిల్లా స్థాయి అధికారులతో వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు..

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. రాష్ట్ర కుటుంబ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీమతి శ్వేతా మహంతి బుధవారం నిర్మల్ జిల్లాలో జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించి, ఇతర ఆసుపత్రులను బస్తీ దవాఖాన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.
నిర్మల్ పట్టణంలోని బ్రహ్మపురి లో జరుగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు, అక్కడికి వచ్చిన కంటి చూపు పరీక్ష కోసం వచ్చిన వారితో మాట్లాడారు ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ వచ్చిన వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే లబ్ధిదారులకు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. తర్వాత దిలావర్ పూర్ లో జరుగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు.

మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి శిశువులకు, తల్లులకు అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగైన నాణ్యమైన సేవలను అందించాలని అక్కడి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలను పెంచాలని ముఖ్యంగా సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి ఆపరేషన్ ప్రసవాలను తగ్గించాలని కోరారు.
తర్వాత జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు ఇతర జిల్లా స్థాయి అధికారులతో వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
గర్భవతులకు ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్న వారికి సకాలంలో సేవలు అందించాలని ,ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచాలని, రక్త పరీక్షల లక్ష్యానికి అనుగుణంగా నమూనాలను సేకరించి టీ డయాగ్నస్టిక్ హబ్ పంపాలని కోరారు.
జిల్లాలలో జరుగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు, త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking