పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి. గిరిజన ఆదివాసి పేదలను ఆదుకోవాలి.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 15 : పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి గిరిజన ఆదివాసి పేదలను ఆదుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.బుధవారం ఈ సందర్భంగా సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ…దండేపల్లి మండలంలోని కోయపోచంగూడెం లోని ఆదివాసి (నాయకపోడు) గిరిజన పేదలు గత 2002 సం,, నుంచి 2022 వరకు సర్వేనెంబర్ 25,26 లో గల ఉన్న పోడు భూమిని సాగు చేసుకుంటూ అందులో బబ్బెర,కందులు, మక్కలు,వివిధ రకాల పంటలు పండిస్తున్నారు.మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే హక్కు పత్రాలు ముందుగా కోయపోచం గూడెం గ్రామం సర్వే నిర్వహించి అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోమాస ప్రకాష్,జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్,దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి,దాసరి రాజేశ్వరి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, కోయపోచం గూడెం ఆదివాసీ పేదలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking