ఆర్ సి ఓ గోపీచంద్ నాయక్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ అక్టోబర్ 5 : క్రీడాకారులు పట్టుదలతో ఆడితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్ సి ఓ గోపీచంద్ నాయక్ అన్నారు.మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే గురుకులంలో గత ఐదు రోజులుగా సాగుతున్న అండర్ 14,19 క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆర్సీవో మాట్లాడుతూ…గురుకుల పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.జిల్లా స్థాయి పోటీలు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగడం సంతోష కర మన్నారు. విద్యార్థులు క్రీడల పైన ఎలా దృష్టి పెట్టి కష్టపడివిజయం సాధించాలని చూస్తారో అలాగే విద్యపై కూడా శ్రద్ధ చూపినట్లయితే భవిష్యత్తులో రాణించగలుగుతారన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని ఓడిపోయినంత మాత్రాన్ని నిరాశ పడవద్దనీ, మళ్లీ సాధన చేయాలని, చేసిన తప్పులను దృష్టిలో ఉంచుకొని మళ్లీ పోటీలలో అలాంటి తప్పులు చేయకుండా ఆడినట్లయితే విజయం ఖచ్చితంగా సొంతమవుతుందన్నారు. అనంతరం డి సి ఓ షేరు శ్రీధర్ మాట్లాడుతూగత ఐదు రోజులుగా క్రీడాకారులంతా ప్రశాంతంగా ఆటలాడడం చాలా సంతోషంగా ఉందన్నారు.కృషి ఉంటే మనుషులు ఋషుల వుతారని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ గౌతమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాధన చేస్తే సాధ్యం కానిది ఏది ఉండదని అన్నారు. విద్యార్థులు జిల్లా స్థాయిలో గెలవడంతోపాటు రాష్ట్రస్థాయిలో కూడా పట్టుదలతో ఆడి విజయం సాధించి మహాత్మ జ్యోతిబాపూలే సంస్థకు మంచి పేరు తీసుకురావాలన్నారు. త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులు సిద్ధం కావాలన్నారు. పాటలపై ఎంత శ్రద్ధ వహిస్తారో, అదేవిధంగా శనివారం నుండి జరగబోయే పరీక్షల్లో కూడా పోటాపోటీగా చదివి ఎక్కువ మార్కులు సంపాదించాలని తెలిపారు. అండర్ 19 విభాగంలో లక్షెట్టిపేట బాలుర జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, అండర్ 14 విభాగంలో గుడి పేట బాలుర జట్టు ప్రథమ స్థానాన్ని గెలుపొందింది. పోటీలలో గెలుపొందిన ఆర్ సి ఓ విజేతలకు బహుమతులను అందజేశారు.బహుమతి కార్యక్రమానికి ముందు విద్యార్థులు చేసిన యోగ, పిరమిడ్ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బాలికల గురుకుల పాఠశాల ఇన్చార్జి నాగచంద్ర,ఏటీపీ సునీత, పిడి రాజేష్,పీఈటి కార్తీక్ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.