_ జిల్లా ప్రధాన కార్యదర్శి కచ్చు హరీష్_
జగిత్యాల, అక్టోబర్ 5: జగిత్యాల జిల్లా కురుమ సంఘం రెండేండ్ల పదవి కాలం పూర్తయిందని తిరిగి ఎన్నికలను నిర్వహించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కచ్చు హరీష్ కోరారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో జగిత్యాల జిల్లా కురుమ సంఘం ఎన్నికలు జరిగి రెండేండ్ల పదవి కాలం పూర్తయ్యిందన్నారు. జరగబోయే ఎన్నికలలో ఎందరో ఆశావహులు పోటీచేయడానికి ఆసక్తితో ఉన్నారన్నారు. ప్రస్తుత జిల్లా కార్యవర్గం చేసిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని కొత్తగా ఎన్నికయ్యే జిల్లా కురుమ సంఘం నూతన కార్యవర్గం జిల్లాలోని కురుమల అభివృద్ధికి కృషిచేసే అవకాశం ఉంటుందని హరీష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే జిల్లా కురుమ సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర కార్యవర్గం చొరవ తీసుకోవాలని కచ్చు హరీష్ కోరారు.