అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 5 (ప్రజాబలం) ఖమ్మం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం జిల్లా ఓటర్ల తుది జాబితా ప్రచురించినట్లు ఆయన తెలిపారు. తుది ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 1196293 మంది ఓటర్లు ఉండగా, ఖమ్మం నియోజకవర్గంలో 315726 మంది, పాలేరు నియోజకవర్గంలో 232606 మంది, మధిర నియోజకవర్గంలో 218585 మంది, వైరా నియోజకవర్గంలో 190755 మంది, సత్తుపల్లి నియోజకవర్గంలో 238621 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 5 నియోజకవర్గాల్లో ఇపి రేషియో 693, జెండర్ రేషియో 1061, ఎన్ఆర్ఐ ఓటర్లు 146 మంది, సర్వీస్ ఓటర్లు 682 మంది, పిడబ్ల్యూడి ఓటర్లు 26968 మంది, 80 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజెన్ ఓటర్లు 16761, 18-19 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు 44204 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ జాబితాను కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్ కార్యాలయాలతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు ఆయన అన్నారు ఈ సందర్బంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటరు జాబితా పెన్ డ్రైవ్ లను ఆయన అందజేశారు. జిల్లాలో 822 లోకేషన్లలో 1455 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు ఆయన అన్నారు. జిల్లాలో ఇంకా ఎవరైనా అక్టోబర్ 1 ,2023 నాటికి 18 సంవత్సరాలు నిండి, ఓటరు జాబితాలో పేర్లు లేకుంటే వెంటనే ఆన్లైన్ లో ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ముగింపు నాటికి ఓటరుగా నమోదు కావాలన్నారు ఈ సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పసునూరి శ్రీనివాస్, బిజెపి పార్టీ ప్రతినిధి జిఎస్ఆర్ఏ. విద్యాసాగర్, సీపీఐ(ఎం) పార్టీ ప్రతినిధి పొన్నం వెంకటేశ్వర రావు, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి లింగబోయిన సతీష్, టిడిపి పార్టీ ప్రతినిధి కె. కరుణాకర్, బీఎస్పీ పార్టీ ప్రతినిధి సిహెచ్. నాగేశ్వరరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సీనియర్ అసిస్టెంట్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.