గృహలక్ష్మి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 5 (ప్రజాబలం) ఖమ్మం సొంత ఇల్లు లేని పేద, సామాన్య ప్రజలకు తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న వరం గృహలక్ష్మి పథకం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం నగరం భక్తరామదాస్‌ కళా క్షేత్రంలో లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలను మంత్రి పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. పేదల సొంతింటి కలనెరవేర్చలన్న సంకల్పంతో ఆలోచన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె.చంధ్రశేఖర్‌రావు గృహలక్ష్మి పథకం క్రింద రూ.3 లక్షల ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని, రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి వర్తింప జేస్తాం అన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక గృహలక్ష్మి పథకమని పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతరం ప్రక్రియ అని తెలిపారు. తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందని, మంత్రి అన్నారు.
కార్యక్రమంలో మేయర్‌ పునుకొల్లు నీరజ, డెప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహార, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ దోరేపల్లి శ్వేత, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, డెప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ మల్లీశ్వరి, కార్పొరేటర్‌ లు దాదే అమృతమ్మ సతీష్‌, పాకాలపాటి విజయ నిర్మల శేషగిరి రావు, , పగడాల శ్రీవిద్య నాగరాజు, శీలంశెట్టి రమా వీరభద్రం, మడురి ప్రసాద్‌, బుర్రి వెంకట్‌ కుమార్‌, మాటేటి అరుణ, పసుమర్తి రాం మోహన్‌, బుడిగం శ్రీను, మాజీ కార్పొరేటర్‌ కు తోట రామారావు, మాటేటి నాగేశ్వర రావు, పొన్నం వెంకటేశ్వర్లు, బుర్రి వినయ్‌ కుమార్‌, కన్నం ప్రసన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking