పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 05 (ప్రజాబలం) ఖమ్మం నగరం ప్రతి డివిజన్‌లో నిరంతరం అభివృద్ధి పనులను చేపట్టి నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం మంత్రి ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 10, 26, 37, 39, 40, 42వ డివిజన్లలో రూ.2.10 కొట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 40వ డివిజన్‌ జమ్మిబండ వద్ద ఎస్‌డిఎఫ్‌ నిధులు రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ.15లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్‌, సిడిపి నిధులు రూ.10లక్షలతో నిర్మించనున్న టాయిలెట్స్‌ నిర్మాణ పనులకు పనులకు శంకుస్థాపన చేశారు. 42వ డివిజన్‌ నిజంపేట లో ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ.18లక్షలతో సీసీ రోడ్స్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 37వ డివిజన్‌ ఖిల్లా రోడ్‌ నందు సుడా నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్స్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. 39వ డివిజన్‌ శివాలయం రోడ్‌ వద్ద సుడా నిధులు రూ.20లక్షలతో నిర్మించిన సీసీ రోడ్స్‌ ను మంత్రి ప్రారంభించారు. సిడిపి నిధులు రూ.10 లక్షలతో మజీద్‌ నందు టాయిలెట్స్‌, కాంపౌండ్‌ వాల్‌ ప్రారంభించారు. 26వ డివిజన్‌ రిక్కా బజార్‌, వెంకట్‌ గిరి రోడ్‌ గేట్‌ వద్ద ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ.35 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సుడా నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన బిటి, సీసీ రోడ్లను ప్రారంభించారు. 10వ డివిజన్‌ ఎస్‌ఆర్‌ అండ్‌ బిజిఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుడా నిధులు రూ.12 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్స్‌ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాభివృద్దిలో చిత్తశుద్ధితో, నిజాయితీ, నిబద్దతతో పని చేస్తుమని, ఇక్కడ అందించిన సంక్షేమం ఎక్కడ జరగలేదన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ద్వారా ధరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించడం జరిగుతుందన్నారు. ఇప్పటికే 2వేల మందికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను లబ్దిదారులకు అందజేయడం జరిగిందని. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి 4వేల మందికిప్రభుత్వ ఉత్తర్వునెం.58 ద్వారా వారికే పట్టాలు ఇచ్చి పూర్తి హక్కు కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు అనంతరం గృహలక్ష్మి పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారులకు మంత్రి మంజూరు పత్రాలు అందజేశారు కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, డిసిసిబి ఛైర్మన్‌ కూరాకుల నాగభూషణం, మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహార, సుడా చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, కార్పొరేటర్‌ లు కర్నాటి కృష్ణ, దాదే అమృతమ్మ సతీష్‌, మడురి ప్రసాద్‌, పాకాలపాటి విజయ నిర్మల శేషగిరి రావు, నాయకులు పగడాల నాగరాజు, లక్ష్మీ ప్రసన్న, పునుకొల్లు రాం బ్రహ్మం, గౌతం బాబా, కొండల్‌, అసిఫ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking