రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్లా గంగరాజం
జగిత్యాల, అక్టోబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జగిత్యాల జిల్లా పక్షాన స్వాగతిస్తున్నామని ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్లా గంగరాజం అన్నారు. గురువారం జిల్లా పెన్షనర్ భవనంలో జిల్లాలోని 8 శాఖల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించి పలు తీర్మానాలను చేశారు. ఈ సందర్భంగా గంగరాజం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని స్వాగతిస్తున్నామని ఐఆర్ 5 శాతం ప్రకటించడం బాధాకరమన్నారు. ఐఆర్ ను 15 శాతం ఇవ్వాలని ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్ ను ఉద్యోగ, పింఛన్ దారుల భాగస్వామ్యంతో కల్పించాలని కోరారు. కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ పీరియడ్ ను 15 ఏండ్ల నుంచి 12 ఏండ్లకు తగ్గించాలని కోరారు. 398 రూపాయల వేతనంపై పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ మంజరి చేయాలని గంగరాజం కోరారు. ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని మూడు డి.ఏ లను వెంటనే ప్రకటించాలని గంగరాజం కోరారు. ఈ డిమాండ్లు నెరవేరని తరుణంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని గంగరాజం హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కరభూజ రవీందర్, కోశాధికారి మల్లికార్జున్ తోపాటు కార్యవర్గ సభ్యులు ఎనిమిది శాఖల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.