విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రకాష్ గౌరా
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్05 (ప్రజాబలం) ఖమ్మం యశోద ఆసుపత్రిలో అత్యంత అరుదైన టైప్ బి బ్రహద్దమని విచ్చేదనానికి సకాలంలో వైద్య చికిత్స చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన వృద్ధుడి ప్రాణాలను యశోద ఆసుపత్రి సీనియర్ వాస్కులర్ కన్సల్టెంట్ ఇండో వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ప్రకాష్ గౌరా ఆధ్వర్యంలో ప్రాణాలు కాపాడినట్లు నిర్వాహకులు డాక్టర్ ప్రకాష్ గౌరా తెలిపారు.గురువారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బృహద్దమని విచ్ఛేదనంవల్ల వచ్చే ఛాతినొప్పి వీపు భాగానికి కూడా విస్తరిస్తుందని, రోగి ప్రాణాలు కాపాడాలంటే వీలైనంత త్వరగా దాన్ని గుర్తించడం, సరైన వైద్యం చెయ్యడం చాలా అవసరమన్నారు బృహద్ధమనిలో ఎంట్రీ టియర్ స్థానాన్ని బట్టి విచ్ఛేదనం టైప్ ఏ టైప్ బి అని రెండు రకాలుంటాయని,టైప్ ఏ కి సాధారణంగా కార్డియాక్ సర్జన్స్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారని, టైప్ బి కి సర్వసాధారణంగా విస్తృత స్థాయి ఐ. సి.యు.పర్యవేక్షణ చాలా అవసరమన్నారు కొంతమంది రోగులకు ఎండో వాస్కులర్ ఇంటర్ వెన్షన్ అవసరమవుతుందని, తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామం చెందిన 65 సంవత్సరాల వృద్ధుడు బాదావత్ వెంకట్రావు కు యశోదా ఆసుపత్రిలో అరుదైన చికిత్స ద్వారా ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. రోగిని అంతకంతకూ పెరుగుతున్న ఛాతీ నొప్పి, హైపర్ టెన్షన్, ఆర్గాన్ మాల్ ఫర్ఫ్యూజన్ తో ఆసుపత్రికి తీసుకొచ్చారని, పరీక్షించిన వైద్య బృందం టైప్ బి బృహద్దమని విచ్ఛేదనంగా గుర్తించి,రోగి కాస్త కుదుట పడిన తర్వాత ఎండో వాస్క్యులర్ ఆర్ధిక సెంటింగ్ చేసినట్లు తెలిపారు ఆపరేషన్ తర్వాత రోగి ఆరోగ్యం తో బాగా కోలుకొని రక్తపోటు సాధారణ స్థితికి వచ్చి గుండె పనితీరు మెరుగుపడిందన్నారు.మూడు రోజుల తర్వాత ఆసుపత్రినుండి డిశ్చార్జ్ చెయ్యడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ మలక్ పేట లోని యశోదా ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల బృందం అత్యంత క్లిష్టతరమైన గుండె జబ్బులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు, అందుబాటులో ఉన్నాయని, అత్యంత క్లిష్టతరమైన వ్యాధులకు కూడా యశోదా వైద్య బృందం చక్కటి చికిత్సను, పరిష్కారాలను అందజేస్తోందని యశోద హాస్పిటల్ డైరెక్టర్ గోరుకంటే పవన్, యునిట్ హెడ్ కె. శ్రీనివాస్ రెడ్డి తెలిపార ఖమ్మం వైరా రోడ్డులో పాత బస్టాండు దగ్గరున్న యశోదా హాస్పిటల్ మెడికల్ సెంటర్ లో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు సేవలు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని వివరాలకు ఖమ్మం వాసులు 7075172575 నెంబరును సంప్రదించవచ్చని యశోదా ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.