జిల్లా కలెక్టర్ ను కోరిన అంబేడ్కర్ సంఘ నేతలు
జగిత్యాల, సెప్టెంబర్ 16: ఇటీవలే మెట్ పెల్లి పట్టణంలో హత్యకు గురైన దళిత యువకుడు కన్నం సతీష్ కుటుంబము ఆర్థిక ఇబ్బందులకు గురవుతొందని తక్షణమే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని అంబేద్కర్ సంఘాల నాయకులు కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. శనివారం మృతుడి భార్య కన్నం పవిత్ర తో కలిసి అంబేద్కర్ సంఘాల రాష్ట్ర నాయకులు లింగంపల్లి సంజీవ్, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల నరేష్, కోరుట్ల నాయకులు బర్ల ప్రణయ్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కొంగర పవన్ లు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కన్నం సతీష్ మరణంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. హత్యకు గురైన దళితులకు అట్రాసిటీ ప్రొవిన్స్ ప్రకారం నష్టపరిహారం అందించాలని అలాగే విద్యావంతురాలైన పవిత్రకు ఒక ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శనిగారపు రాజయ్య, గజ్జల రాజు, బీమారం మండల అద్యక్షులు బంగారు దీపక్, పసుల శివ, కన్నం నాగరాజు లు ఉన్నారు.