వార్షిక తనిఖీల్లో భాగంగా చెన్నూర్ రూరల్ సీఐ ఆఫీస్,కోటపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గం రిపోర్టర్ సెప్టెంబర్ 30 : ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ అంకితభావంతో విధులు నిర్వహించాలి.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి చట్టపరిధిలో సమస్యల పరిష్కారం కు కృషి చేయాలి.వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ జైపూర్ సబ్ డివిజన్ చెన్నూరు రూరల్ సీఐ ఆఫీస్,కోటపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ కి వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ మొదట పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం కోటపల్లి పోలీస్ స్టేషన్, చెన్నూర్ రూరల్ సీఐ ఆఫీస్ చుట్టూ పరిసరప్రాంతాల సోమవారం పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధి సరిహద్దు,ప్రాణహిత సరిహద్దు గ్రామాలు,ఏ తరహా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి,ఈ ప్రాంతం నుండి మావోయిస్టు పార్టీ లో ఉన్నారు అని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను,గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీ లు,నాఖ బందీలు,ఏరియా డామినేషన్,కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహించాలి.నిరుద్యోగ యువత శిక్షణ లు ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం,జాబ్ మేళాలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలి అని తెలిపారు.పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.ప్రతి రోజు పోస్ట్ ప్రొడక్షన్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు.పోలీస్ సిబ్బంది గ్రామాలలోని యువత కు మార్గం దర్శకంగా ఉండి వారిని ఉద్యోగం ప్రయత్నాలకు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తూ వారిని చెడు మార్గాల వైపు, చెడు అలవాట్లకు బానిసలుగా గా మారకుండా వారి భవిష్యత్తు కు దిశ నిర్దేశం చేయాలి అన్నారు. పోలీస్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప్రజలతో ఎక్కువగా కలుస్తూ మాట్లాడడం, సమస్య లు తెలుసుకోవడం జరుగుతుంది కావున సిబ్బంది ప్రవర్తన,పని తీరు ఫై పోలీస్ శాఖ ఫై నమ్మకం, భరోసా పేరు,ప్రతిష్ట ఎక్కవ ఆధారపడి ఉంటుందని అన్నారు.పోలీస్ స్టేషన్ కి వచ్చే వారితో మర్యాదగా మెలాగలన్నారు.ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు, యువత తో మంచి సత్సంబంధాలు కలిగి ఉండి సమాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోని తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కి సమస్య లతో వచ్చే మానవత్వం, సానుభూతి తో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ సేవలు అందించాలన్నారు. పాత నెరగాళ్లపై నిఘా ఉంచాలని, 100 డయల్ ఫిర్యాదుల పట్ల వేగవంతమైన స్పందన ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చెయ్యాలని అన్నారు. అలాగే రోజు వారి వాహన తనిఖీలు చేస్తూ రోడ్డు భద్రత నియమలపై ప్రజలకు అవగాహన కల్పించాలని,రౌడీలు, కేడీలు,సస్పెక్ట్స్ మరియు సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి,వారి కదలికలను గమనించాలని,చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి వారిని బైండోవర్ చేయాలన్నారు. ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉంది మెరుగైన సేవలు అందించాలన్నారు, సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అధికారులు సిబ్బంది ప్రొయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని. పోలీస్ అధికారులకు సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే ఎస్సై,సీఐ లకు తెలియదు చేయాలనీ లేదా సీపీ కూడా చెప్పా వచ్చు అని తెలిపారు.విధి నిర్వహణలో అధికారులు సిబ్బంది పోటీపడి విధులు నిర్వహించాలని అంకిత భావంతో విధులు నిర్వహించే వారికి రివార్డులు అవార్డులు ప్రతినెలా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో చెన్నూరు సీఐ సుధాకర్,కోటపల్లి ఎస్ఐ రాజేందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking