అండర్ 14 అండర్ 17 బాలికల విభాగాలకు సంబంధించి రెజ్లింగ్ కుస్తీ పోటీల కోసం రాష్ట్రస్థాయి ఎంపికైనట్టు ప్రిన్సిపల్ కె.రమా కల్యాణి
ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ సెప్టెంబర్ 30 : అండర్ 14 విభాగానికి సంబంధించి ఇద్దరు బాలికలు అండర్ 17 విభాగానికి సంబంధించి ఒక్క బాలిక ఎంపికైనట్టు ప్రిన్సిపల్ సోమవారం తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ…జోనల్ స్థాయి సెలక్షన్స్ స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల లక్షెట్టిపేటలో నిర్వహించగా,తమ పాఠశాలకు చెందిన పై ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు పాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోన్ గా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్ నుండి సుమారు 40 మంది విద్యార్థినులు ఈ సెలక్షన్స్ లో పాల్గొనగా,అందులో తమ పాఠశాలకు సంబంధించిన ముగ్గురు ఉండడం విశేషంగా పేర్కొన్నారు.రాష్ట్రస్థాయికి ఎంపికైన గురుకుల పాఠశాల విద్యార్థినులను కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే.మహేశ్వర రావు, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ కే.శ్రీలత పాఠశాల పిఈటి ఎం.మమత తదితరులు అభినందించారు.