కాంగ్రెస్ అభ్యర్థి ఇంటిలో పోలీసుల సోదాలు

 

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 08(ప్రజాబలం) ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో బుధవారం ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు పోలీసులతో పాటు కొందరు రెవెన్యూ అధికారులు కూడా సోదాల్లో పాల్గొన్నారు పోలీసులతో పాటు ఈసీ అధికారులు కూడ ఉన్నారని సమాచారం . ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35 వేల బోగస్ ఓట్లను చేర్పించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు . మంత్రి అజయ్ సూచన మేరకు కలెక్టర్ , ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు బోసగ్ ఓట్లను చేర్పించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ విషయమై ఎన్నికల అధికారులకు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆ ఫిర్యాదులో తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించారు ఈ ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీసిటీ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం తుమ్మల తన నివాసం నుంచి బయటకు వెళ్లిపోయారు . ఆయన వెళ్లిన తర్వాత పోలీసులు తుమ్మల ఇంట్లోకి వచ్చారు ఆ సమయంలో ఇంట్లో తుమ్మల భార్యతో పాటు కొందరు అనుచరులు ఉన్నారు మరోవైపు తుమ్మల నివాసంలో సోదాలపై కాంగ్రెస్ శ్రేణులు మండి పడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టేందుకే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్య బడుతున్నాయి

Leave A Reply

Your email address will not be published.

Breaking