ఖమ్మం ప్రతినిధి నవంబర్ 8 (ప్రజాబలం) ఖమ్మం బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేసి పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు నేలకొండపల్లి పట్టణం మాజీ ఉప సర్పంచ్ రాజపుత్ర శ్రీనివాస సింగ్, మాజీ వార్డు మెంబర్లు కైలాసపు వెంకటేశ్వర్లు మన్నె రవి నాయకులు మోర పుల్లయ్యలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వంగవీటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారందరికీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు.