జనహృదయనేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించండి

పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 8 (ప్రజాబలం) ఖమ్మం
జిల్లా తిరుమలాయపాలెం మండలం యాదవ కురుమల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన గొప్ప వ్యక్తి పొంగులేటి శీనన్న అని పదవి ఉన్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచు కుంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల హృదయoలోనిలిచిపోయిన సేవా తత్పరుడు మంచి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిపించాలని పొంగులేటి ప్రధాన అనుచరుడు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ పిలుపునిచ్చారు తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో మల్లి బాబు యాదవ్ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపు కొరకు పిండిప్రోలు గొర్రెల సంఘం అధ్యక్షులు దొడ్డ గురవయ్య అధ్యక్షతన మల్లి బాబు యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తానని, కురుమ యాదవులను కోటీశ్వరులను చేస్తానని, ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తానని, ఉపాధి హామీ పథకం ద్వారా గొర్రెలకు షెడ్లు ఏర్పాటు చేస్తానని, ఎన్నో హామీలు ఇచ్చి, గొర్రెల పంపిణీ పథకం కింద డీడీలు తీసిన వారికి గొర్రెలు ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బమ్మిడి శ్రీనివాస్, దొడ్డ గురవయ్య జాల రవి, దూదిమెట్ల వెంకట్, గుంటి మల్లయ్య జాల నాగేశ్వరరావు, పూజల శ్రీను బసన బోయిన వీరయ్య, జాల వెంకటేశ్వర్లు నూకల ఏడుకొండలు , జాల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking