జాతీయ న్యాయ సేవను సద్వినియోగం చేసుకోవాలి

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 08: జాతీయ న్యాయ సేవ దినోత్సవంను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని లక్షెట్టిపేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్ పిలుపునిచ్చారు.బుధవారం పట్టణంలోని స్థానిక న్యాయస్థానము ఆవరణలో న్యాయవాదులతో కలిసి ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ…నేటి న్యాయసేవ దినోత్సవంను పురస్కరించుకొని పరిష్కారానికి వీలైనటువంటి సివిల్,క్రిమినల్ కేసులు కక్షిదారులు రాజీ పడితే, ఎలాంటి కేసులు ఉండవన్నారు. అంతేకాకుండా ఎలాంటి కోర్ట్ ఫీజులు లేకుండా కేసులు ఉచితంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.లక్షెట్టిపేట కోర్టు పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో అక్కల శ్రీధర్, తిప్పని రవికుమార్, సత్యం,వినీత,కోర్ట్ సిబ్బంది నీరజ,యశోద తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking