పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి

జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 02 : రానున్న పార్లమెంట్ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా వాతావరణంలో సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయం భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సబావత్ మోతిలాల్ తో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రజలతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మంచిర్యాల జిల్లాలోని ఎన్నికల నిర్వహణ కొరకు సహాయక చర్యలు చేయడం జరుగుతుందని,ఒక పోలింగ్ కేంద్రంలో 1 వెయ్యి 500 మంది ఓటర్లు గా ఉండే పరిమితి 1 వెయ్యి 600 మందికి పెంచడం జరిగిందని తెలిపారు. జిల్లాకు సంబంధించిన ఓటర్లు జాబితాలో 583 డూప్లికేట్ ఎఫెక్ట్ కార్డులను నిబంధనల మేరకు తొలగించడం జరిగిందని జిల్లాలోని ఓటర్ల నిష్పత్తి లింగం నిష్పత్తి సానుకూలంగా ఉందని,ఎన్నికల్ పోలింగ్ షా దాన్ని పెంచేందుకు జిల్లాలోని అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఇటీవల జరిగిన శాసనసభ నియోజకవర్గ ఎన్నికల సందర్భంలోని పంపిణీ చేయబడిన ఓటర్ల తో మిగిలిన వారిపై విచారణ జరిపి ఎ ఎస్ డి ఆధారంగా ఓటర్ జాబితా సవరించడం జరిగిందని 18 సంవత్సరాల వయసు నుండిన వారికి నూతన ఓటు హక్కు నమోదు కొరకు భారత ఎన్నికల సంఘం సూచనలు మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున బూత్ స్థాయి సహాయకులను నియమించే బూతు స్థాయి అధికారులు సమన్వయంతో పోలింగ్ కేంద్రం పరిధిలో వయసు భర్త గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించడంతో పాటు ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల తాసిల్దార్ సినిమాస్ ఎన్నికల విభాగ అధికారులు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking