ఏడుపాయల జాతర ఏర్పాట్లపై అధికారులతో సమావేశమైన మెదక్ జిల్లా కలెక్టర్లు.

 

మెదక్ మార్చ్ 2 ప్రాజబలం న్యూస్ :-

ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏడుపాయల జాతర ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయవలసినదిగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు.

ఈ నెల 08 నుండి 10 వరకు మూడు రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించనున్న ఏడు పాయల జాతర ఏర్పాట్ల ప్రగతి పై శనివారం జాతర ఆవరణ గల హరిత హోటల్ నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీవో రమాదేవి దేవాదాయ కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి, , ఆలయ చైర్మన్ బాల గౌడ్ , తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి సంబంధిత ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, పోలీస్ ఎక్సైజ్, లీగల్ మెట్రాలజీ, ఆర్టీసీ, ఫైర్, మెడికల్, విద్యుత్, మత్స్యశాఖ, వెటర్నరీ, సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా రెవిన్యూ శాఖ ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు , మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయవలసినదిగా అధికారులకు సూచించారు. భక్తుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండడమే జాతర విజయవంతానికి నాంది అని అన్నారు, కాబట్టి అధికారులు సమిష్టిగా, సమన్వయంతో ఈ నాలుగు రోజులు మరింత కష్టపడి పనిచేయాలని, సమయం దగ్గర పడుతున్నందున అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు పిన్ పాయింట్ వారీగా రోజు వారి షిఫ్ట్ ప్రకారంసిబ్బందికి విధులు కేటాయించి, పాసులు జారీ చేయాలని తద్వారా సిబ్బంది విదులు సమర్ధవంతగా నిర్వహిస్తారని అన్నారు .
బ్యారీ కేడింగ్ , సీసీ కెమెరాల ఏర్పాటు పారిశుధ్యం పై ఎక్కువమంది పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని, షవర్లు, మంచినీటి కుళాయిలు శౌచాలయాలు అన్ని వినియోగంలో ఉండేలా చూడాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని,
, జిల్లా నలుమూలల నుండే గాక ఇతర ప్రాంతాల నుండి బస్సులు నడపాలని, గజ ఈతగాళ్లు, వైద్య ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ వివిధ శాఖల మధ్య ఉన్న చిన్న సమన్వయ లోపాలను పరిష్కరించుకొని పకడ్బందీగా జాతర నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఆలయంలో భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా క్యూలైన్ నిర్వహించాలని, భక్తులతో సిబ్బంది ఎక్కడ దురుసుగా ప్రవర్తించవద్దని, చాలా సహనంతో విధులు నిర్వహించాలని చెప్పారు ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత దుర్వాసన ఉండకుండా చర్యలు తీసుకోవాలని, వివిఐపి దర్శనాల్లో ఆలయ మర్యాదలను పాటించాలని ఆలయ ఈఓ నుఆదేశించారు. జాతర సమయంలో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.
డీఎస్పీ రాజేశ్వర్ మాట్లాడుతూ ఏడుపాయల జాతరలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడానికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని
ప్రతి ఏరియాలో పోలీస్ సిబ్బంది ప్రజలకు రక్షణగా అందుబాటులో ఉంటారని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, డి ఆర్ డి ఓశ్రీనివాసరావు
ఏడి మైన్స్ జయరాజ్, మత్స్యశాఖ అధికారి నరసింహారావు, , ఆర్టీసీ డిఎం సుధ, ఇండస్ట్రీస్ జిఎం కృష్ణమూర్తి,
ఈఈ పి ఆర్ నరసింహులు, ఆర్ అండ్ బి ఈ ఈ సర్దార్ సింగ్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking