ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 02 : ఉమ్మడి రాష్ట్రంలోని మంథని నియోజకవర్గ శాసనసభ అధిపతిగా రాష్ట్ర అభివృద్ధి విశిష్ట సేవలు అందించిన దుద్దిళ్ళ శ్రీపాదరావు ప్రజల గుండెల్లో సదానియంగా నిలిచారని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం దుద్దిళ్ళ శ్రీపారావు జయంతిని పురస్కరించుకొని జిల్లాలో నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయం భవన సమావేశ నిర్వహించిన వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సబావత్ మోతిలాల్ తో కలిసి పాల్గొని శీపాదరావు పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సర్పంచుగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి మంథని నియోజకవర్గ శాసనసభ్యుడిగా,ఉమ్మడి రాష్ట్ర శాసనసభ అధిపతిగా వివిధ పదవుల్లో పనిచేసి వినూత్న సంస్కరణలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. మృదు స్వభావిగా అన్ని వర్గాల చేరువగా ఉంటూ రాజకీయ జీవితంలో యువతకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రభుత్వం అధికారం గా జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషకరంగా ఉందని. దుద్దిళ్ళ శ్రీపాదరావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ప్రజాసేవలో ముందుకు రావాలని మహనీయులు ఆచరించి చూపిన మార్గాల్లో దేశ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సమితి అధికారులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.