రాజేంద్రనగర్ మణికొండలో రాజకీయ మలుపు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 19 జులై 2024: రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ అంతర్భాగమైన మణికొండ మునిసిపల్ కౌన్సిల్ పరిధిలో భారత రాష్ట్ర సమితి యొక్క కార్, కనుమరుగై పోయినదని కల్లబొల్లి మాటలతో తప్పుడు ప్రచారం చేస్తున్న కొద్దిమంది నాయకులకు దిమ్మ తిరిగే విధంగా, మణికొండ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగళ్ల ధనరాజ్ అధ్యక్షతన గురువారం రోజున సాయంత్రం జరిగిన సమావేశానికి హాల్ మొత్తం బీ.ఆర్.ఎస్ అతి ముఖ్య కార్య కర్తలతో కిక్కిరిసినదని, సమావేశానికి విశేష స్పందన లభించినదనీ, విచ్చేసిన కార్యకర్త లందరూ పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తించడమే కాకుండా రాబోయే సమయంలో ప్రణాళిక బద్దంగా ఏకతాటిపై పార్టీ సీనియర్ నాయకుల సహాయ సహకారాలతో పార్టీకి అండదండ లందిస్తూ ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగుతామని ప్రతీ ఒక్కరూ తమ తమ లక్ష్యంగా పనిచేస్తామని చెప్పడం జరిగినదని, రాబోయే సమయంలో అమ్మవారి బోనాల పండుగకు, గణపతి నవరాత్రి ఉత్సవాలకు పార్టీ సభ్యులందరూ కలసి కట్టుగా సోదర భావంతో సేవలందించడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, పార్టీ అధిష్ఠానం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిని త్వరలో ప్రకటిస్తుందని ఆశిస్తూ, తదుపరి పార్టీ ఆదేశానుసారం మణికొండలో బూత్ స్థాయి కమిటీల నుండి ఆ పై స్థాయి వరకూ పునర్నిర్మాణం జరుపుట గురించి సముచిత నిర్ణయం తీసుకొంటామని అప్పటి వరకు అనుభవజ్ఞుడైన సీతారాం ధూళిపాళను పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని, అందుకు స్పందించి ఏకాభిప్రాయంతో జరిగిన నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సీతారాం ధూళిపాళ తెలుపుతూ, తన శక్తి మేర అందరినీ కలుపుకొని రాష్ట్ర నాయకుల ఆదేశానుసారం కదం త్రొక్కుతూ ముందుకు సాగుతామని, త్వరలోనే పార్టీ అధిష్టాన ముఖ్యులతో మణికొండలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియ జేసినారు, నిన్న జరిగిన సమావేశానికి కౌన్సిలర్లు వసంత్ రావ్ చౌహాన్, ఆలస్యం నవీన్ కుమార్, సీనియర్ నాయకులు ముత్తంగి లక్ష్మయ్య, డీ. నర్సింగ్ రావు, అందె లక్ష్మణ్ రావు, రాజేంద్ర ప్రసాద్, బాల్ రెడ్డి, శ్రీకాంత్, ఉపేంద్రనాధ్ రెడ్డి, షేక్ ఆరిప్, రామ సుబ్బారెడ్డి, మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి, లతాగౌడ్, సురేఖ, విజయలక్ష్మి, యువ నాయకులు మహేష్, బాబు, శ్రీనాథ్, దిలీప్, కిరణ్, భాను, బాలాజీ, తిరుపతి, ఎల్లస్వామి, శివ ముదిరాజ్ తది తరులే కాకుండా ఇంకనూ చాలామంది కార్య కర్త సోదర సోదరీ మణులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking