రైతు భరోసా 15000 కౌలు రైతులకు 12000 ల పెట్టుబడిని వెంటనే విడుదల చేయాలి
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కుల్కర్ని
సంగారెడ్డి ప్రజాబలం ప్రతినిధి :గత ప్రభుత్వంలో మాదిరిగానే రుణమాఫీ అర్హులందరికీ అందని చందంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నిన్న విడుదల చేసిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా అందరికీ అందించలేకపోయింది. కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఒకే విడతలో మాఫీ చేస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేసి, నిన్న లక్ష రూపాయలు లబ్ధిదారులను ప్రకటించిన ప్రభుత్వం అది కూడా పూర్తిగా అర్హులందరికీ అందించలేకపోయింది. పుల్కల్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో 289 మంది లబ్ధిదారులు ఉండగా కేవలం 171 లబ్ధిదారులకు రుణమాఫీ జరిగింది అని అనంతరావు కులకర్ణి పుల్కల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చెప్పారు . మిగిలిన 118 లబ్ధిదారులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపించింది. వచ్చే విడుదలోనైనా మిగిలిన లబ్ధిదారులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న విధంగా ఆగస్టు 15వ తేదీ లోపల రెండు లక్షలు కలిగిన రైతులకు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలని, అలాగే సరైన సమయంలో రైతు భరోసా కూడా రైతులకు 15000 రూపాయలు, కౌలు రైతులకు రూపాయలు 12000 పంట పెట్టుబడిని వెంటనే విడుదల చేయాలని అనంతరావు కుల్కర్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.
Next Post