ప్రజాపాలనలో రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం..!

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 18 : మంచిర్యాల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి రైతులు,గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.దండేపల్లి మండల ద్వారక,లక్షెట్టిపేట, హాజిపూర్ మండలం గుడిపేట గ్రామంలో రైతు వేదిక వద్ద జరిగిన రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధికారులు,రైతులు అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రైతులు.ఇచ్చిన హామీ మేరకు రైతులు బ్యాంక్ లో తీసుకున్న పంట రుణాన్ని మాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంచిర్యాల శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , రుణ విముక్తులతో కలిసి పాలాభిషేఖం చేశారు.గురువారం రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించగానే మంచిర్యాల నియోజకవర్గం వ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. వర్షంలో సైతం రైతులు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేఖం చేశారు. దండెపల్లి మండలం ద్వారక గ్రామంలోని రైతు వేదికకు చేరుకున్న ఎమ్మెల్యే , కలెక్టర్ దీపక్ కుమార్ లకు రైతులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి లక్సెట్టి పేట, హజీపూర్ మండలాల్లో రైతు సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.హజీపూర్ నుంచి మంచిర్యాల మీదుగా నస్పూర్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసిందన్నారు. విపక్షాలు రుణమాఫీ చేయరంటూ ఎన్ని విమర్శలు చేసినా వారికి దిమ్మతిరిగే విధంగా రుణమాఫీ చేసి గూబగుయ్యి మనిపించామని అన్నారు. పాస్ బుక్ లు ఉన్న ప్రతి రైతుకు బ్యాంక్ లో రుణమాఫీ ఉంటుందని ఉంటుందని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking