“రాజకీయ చాణక్యుడు ప్రతిపక్షాలకు తన పదునైన పదజాలంతో ఒంట్లో వణుకు,ముచ్చెమటలు పట్టించే అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక”
“ఉపాధ్యాయవృత్తి,పాత్రికేయవృత్తి, న్యాయవాదవృత్తి,ప్రజలకు సేవచేయాలనే అంకితభావంతో రాజకీయ చాణుక్యుడి”గా రెండోసారి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు అలుపెరుగని నిత్య కృషివలుడు……
ఈ సారి మెదక్ పార్లమెంటు అభ్యర్థి గా
మెజార్టీతో గెలుపొందడమే లక్ష్యంగా దూసుకుపోతున్న దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు…..
పదవులు శాశ్వతం కాదు ప్రజల కోసం చేసిన అభివృద్ధి,అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేయగానే నేనున్నాను అని బాసటగా నిలవడమే నిజమైన నాయకుడి లక్షణం అని నిరూపించుకున్న రఘునందనుడు…..
ఉపాధ్యాయునిగా విద్యార్థినీ విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దినవాడు.పాత్రికేయుడుగా ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యలను పరిష్కరించినవాడు న్యాయవాదిగా న్యాయంకోసం వచ్చినవాళ్లకు నేనున్నానని ధర్మాసనంలో వాదించి గెలిచినవాడు.రాజకీయాల్లో రాజకీయ అపర చాణక్యుడు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుతం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండలంలోని స్వగ్రామమైన బొప్పాపురం గ్రామ రాజకీయ చాణక్యుడు. మాధవనేని రఘునందన్ రావు గారి పై ప్రత్యేక కథనం……
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి ప్రేరేపితుడై ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఉద్యమ కార్యకర్తగా నాయకుడిగా ఎదిగి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయాన తన వంతు పాత్ర పోషించి కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రకటించాక,తిరిగి అధికారికంగా తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన అమలులోకి వచ్చాక ఉద్యమనాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాడు రాజకీయ ప్రస్థానంలో సొంత రాష్ట్రంలో తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తించక పోయేసరికి వెనువెంటనే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ చతురతతో రాజకీయ చాణుక్యుడి వలె బిజెపి పార్టీలోకి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా తనసొంత నియోజకవర్గం,మండలం దుబ్బాక లోని బొప్పాపూర్ గ్రామం తన స్వస్థలం కావున…..
తన సొంత గడ్డ దుబ్బాక నియోజకవర్గం నుండే బిజెపి నుండి రాజకీయ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాడు. ప్రారంభించింది మొదలు వెనుతిరిగి చూసుకోలేదు చూడలేదు తెలంగాణ వచ్చాక మొదటి సారి దుబ్బాక అసెంబ్లీ ఎం ఎల్ ఏ గా సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరగడంతో బిజెపి పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఓడిపోయాడు….అయినా మొక్కవోని ధైర్యంతో దుబ్బాక నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను తనవంతుగా పరిష్కరిస్తూనే అధికార పక్షాన్ని అభివృద్ధి పనుల విషయంలో నిలదీసేవాడు తర్వాతవచ్చిన
లోక్ సభ ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు.అయినా రాజకీయ చాణక్యుడు కృంగిపోలేదు సరికదా”ఓటములే గెలుపుకు ప్రధాన బాటలు” అవుతాయి అని గట్టినమ్మకంతో బలంతో సంకల్పంతో ముందుకు వెళ్ల సాగాడు అలాఅలా బిజెపిలో ఉంటూనే బిజెపి పార్టీ తరఫున రాష్ట్ర సమస్యలపై అలాగే దుబ్బాక నియోజకవర్గం సమస్యలపై ఎల్లప్పుడూ అనేక వేదికలపై తన గొంతుకను అలాగే మీడియా డిబేట్ లలో తన వాడిని వేడిని అధికారపక్షంపై గట్టిగా చూపించేవాడు….. కేంద్రం చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రను దుబ్బాక నియోజకవర్గం మొత్తం తన పాదయాత్ర ద్వారా నియోజకవర్గ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకొని పాదయాత్రతో ప్రజల్లో,అధిష్టానం దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నాడు దుబ్బాక నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లప్పుడూ ఎటువంటి సమస్య వచ్చినా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అందుబాటులో ఉండేవాడు సమస్యలు పరిష్కరించేవాడు అలా అలా గ్రామ గ్రామాన ప్రతి మండలంలో నియోజకవర్గం అంతటా బిజెపి పార్టీని క్షేత్రస్థాయిలో బలపరుస్తూ ఏడు మండలాల్లో ఆ మండలాల్లోని గ్రామాలలో మండల స్థాయి గ్రామస్థాయి నాయకులను కార్యకర్తలను తయారు చేసుకొని నాయకుని వలె కాకుండా నిత్య శ్రామికుడిలా ఏ మండలంలో ఏ గ్రామంలో ఎలాంటి కార్యక్రమం ఉన్న లేనురాను అని అనే పదం లేకుండా రాకుండా నియోజకవర్గంలోని మండలాలలో గ్రామాలలో జరిగే అనేక కార్యక్రమాలకు దేవీ దేవతలఉత్సవాలకు,పేద మహిళ యువతుల వివాహాలకు హాజరై తనవంతుగా సహాయం అందించేవాడు.అలాగే ఆపదలో ఉన్నవారికి తనవంతుగా ఆదుకునేవాడు,నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేవాడు……అలా అలా గ్రామస్థాయి నుండి మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు అక్కడినుండి రాష్ట్రస్థాయి వరకు దుబ్బాక నియోజకవర్గంలో బిజెపి పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్ళాడు.కరోనా విపత్కర సమయంలో పేద సామాన్య బలహీన బడుగు మధ్యతరగతి వర్గాల ప్రజలకు నాయకులు కార్యకర్తల సహాయంతో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు గ్రామాలకు నిత్యవసర సరుకులను అందజేశాడు…..కాగా 2019 ఆగస్టులో అప్పటి ఎమ్మెల్యే స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నికలు తప్పనిసరి కావడంతో ఉపఎన్నికల్లో రఘునందన్ రావు నిత్య శ్రామికుని వలె కరోనా సమయం అయినా కూడా చెక్కుచెదరని దృఢసంకల్పంతో ఎండనకా వాననకా ప్రతి గ్రామ గ్రామాన బిజెపి జెండా ఎగర వేసుకుంటూ ముందుకు వెళ్లాడు అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉప ఎన్నికల్లో అందర్నీ సమన్వపరుచుకుంటూ వెళ్లి బిజెపి పార్టీ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందాడు……
ప్రజల ఆశీర్వదించి గెలిపించారు అలా ఒక్కసారిగా దుబ్బాక నియోజకవర్గం పేరు జిల్లాలను రాష్ట్రాలను దాటి దేశ రాజధాని మారుమోగిపోయింది అంటే ఆ విజయం యొక్క వ్యాప్తి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చ……కానీ రాష్ట్రంలో అధికార పక్షం టిఆర్ఎస్ పార్టీ ఉండటంతో దుబ్బాక నియోజకవర్గంలో కావలసిన అభివృద్ధి పనులకు,రావాల్సిన నిధులకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది.అయినా సరే మొక్కవోని ధైర్యంతో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో దుబ్బాకకు రావాల్సిన నిధులను రాబట్టడంలో కావలసిన పనులను చేయించుకోవడంలో ఉన్న తక్కువ సమయంలో ఎమ్మెల్యేగా రఘునందన్ రావు సఫలీకృతుడు అయ్యాడు అనే చెప్పవచ్చు. అసెంబ్లీలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కోసం మాట్లాడిన ఏకైక గొంతుక రఘునందన్ రావు అంటే అతిశయోక్తి కాదు అలాగే మల్లన్న సాగర్ కోసం అదనపు టిఎంసి కోసం భూముల కోల్పోతున్న రైతులకు వారి తరఫున నిలబడిచెక్కులు ఇప్పించిన ఘనత కూడా వారికే దక్కుతుంది.మట్టిని తరలించే విషయంలో నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాలు గ్రామాలలో నాశనం చేసిన రోడ్లను అసెంబ్లీలో సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడి రోడ్లను తిరిగి పునరుద్ధ పునరుద్ధరించిన ఘనత కూడా వారికే దక్కుతుంది.ఎమ్మెల్యేగా గెలిచినాక ఉన్నదే అతి తక్కువ సమయం కావడం వల్ల నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఒక్కఫోన్ కాల్ కు స్పందిస్తానని స్పందించని యెడల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చివారి వారి సమస్యలను వివరించాలని కోరారు.అలా అలా నియోజకవర్గంలోని అన్ని మండలాల వారీగా ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గానికి రావాల్సిన బిల్లుల విషయంలో పెన్షన్ల విషయంలో అధికార పార్టీ చేస్తున్న కుట్రలను కూడా చాకచక్యంగా తిప్పికొట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి వివిధ రకాల పెన్షన్లు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, నియోజకవర్గానికి రావాల్సిన నిధులు తీసుకురావడంలో సఫలీకృతుడయ్యాడు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చేత శభాష్ అనిపించుకొని దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రసాద్ స్కీం కిందకు వచ్చేటట్లు చేసి ఆలయ అభివృద్ధికి బాటలు వేశాడు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే దుబ్బాక నియోజకవర్గం లోని మొట్టమొదటిసారి అర్హత కలిగిన యువతి యువకులకు వయోజనులకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈకార్యక్రమం దిగ్విజయంగా జరిగింది అనడంలో ఎలాంటి సందేహంలేదు….. దుబ్బాక నియోజకవర్గంలోని మొట్టమొదటిసారిగా నిరుద్యోగ యువతీ యువకులకోసం మెగా జాబ్ మేళా నిర్వహించి వివిధ రంగాల్లో ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా రఘునందన్ రావు గారికే దక్కుతుంది.ఇక ఈసారి మరో ఎనిమిది రోజుల్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి తిరిగి భారీ మెజార్టీతో దుబ్బాక నియోజకవర్గంలో బిజెపి పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది దుబ్బాక గడ్డపై తిరిగి బిజెపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అలుపెరుగని శ్రామికుని వలె గ్రామ గ్రామాన ప్రచారంలో ముందుంటూ ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలను అనుసంధానం చేసుకుంటూ ఉన్న అతితక్కువ సమయంలో నియోజకవర్గానికి చేసిన పనులను అభివృద్ధిని పరిష్కరించిన సమస్యలను వివరిస్తూ అధికారపక్షం ఎన్ని రకాలుగా తనహయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి కాకుండా చేయాలనే ప్రయత్నాన్ని అదే ఎమ్మెల్యే అధికారంతో అలాగే న్యాయం అనేపవర్ తో ముందుకు వెళుతూనే నియోజకవర్గాన్ని అతి తక్కువ సమయంలో సాధ్యమైనంత అభివృద్ధి సమస్యలను పరిష్కరించారు అనడంలో సందేహం లేదు……
ఈ సారి మెదక్ పార్లమెంటు అభ్యర్థి గా బి జే పీ పార్టీ నిర్ణయించడం తో ఆయన ఉమ్మడి మెదక్ జిల్లా కు సూపరిచుతుడు కావటం గెలుపే కాకుండ భారీమెజార్టీ సాధించడమే లక్ష్యంగా ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించాలనే ధ్యేయంతో ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో ఏ మండలానికి ఏగ్రామానికి వెళ్ళినా ప్రజలు హక్కున చేర్చుకోవడం ఖాయం అని అత్యధిక మెజార్టీ సాధించి పెట్టి రఘు అన్నకు బహుమతిగా ఇవ్వడమే తమ లక్ష్యమని బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు అంటున్నారు.