సాధారణ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ ఎం ఎస్ ప్రియాంక శుక్లా, జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సందర్బంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ ఎం ఎస్ ప్రియాంక శుక్లా, జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ పర్యవేక్షణ లో మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు.
శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ ఐ సి హాల్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గనికి సంబందించి ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఏన్ఐసి సాఫ్ట్ వెర్ వినియోగిస్తూ అన్ లైన్ లో పోలింగ్ సిబ్బందికి సంబంధించిన మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది . ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మేడ్చల్, మల్కాజ్గిరి, క్కుత్బుల్లాపూర్ , కూకట్ పల్లి, ఉప్పల్ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 2425 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మూడవ విడత ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్ తెలిపారు. ఐదు నియోజక వర్గాలకు గాను 2860 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి మూడవ ర్యాండమైజేషన్ కేటాయింపు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2425 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటికి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఓ పి ఓ లను కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు విజయేందర్ రెడ్డి, డి ఆర్ ఓ హరిప్రియ, డి ఈఓ విజయ కుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.