పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధం.

 

స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి:

శనివారం సాయంత్రం 05 గంటలతో జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ముగిసాయి.

సైలెన్స్ పీరియడ్ లో 24 గంటలు పకడ్బందీ నిఘా కొనసాగించాలి

బల్క్ ఎస్ ఎం ఎస్ లు, సామాజిక మాధ్యమాల్లో ప్రచార పోస్టులు సైతం నిషేధం .
శనివారం సాయంత్రం 05 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు సభలు, సమావేశాలు రద్దు, ప్రజలు గుంపులుగా ఉండొద్దు. పటిష్ట పర్యవేక్షణలో భాగంగా ప్రజలు యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలి…

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, 11 మే 2024 ప్రాజబలం న్యూస్ :-

పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లుమెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.

శనివారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ బాలస్వామి, సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మెదక్ జిల్లా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలు, జిల్లా వ్యాప్తంగా ఓటర్స్ వివరాలు పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్, ఓటర్ గుర్తింపు కార్డులు, పంపిణీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్, ఈవీఎం కమిషనింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాలు పి ఓ, ఓ పి ఓ, వివరాలు రిజర్వ్ లో ఉన్న బి యు, సి యు వివి ఫాట్స్, కంట్రోల్ రూమ్ ఫిర్యాదులు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ సర్వీస్ ఓటర్స్ వీడియో కెమెరా వెబ్ కాస్టింగ్ సిసి టీవీ డిస్ట్రిబ్యూటింగ్ రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్స్ పోలింగ్ నిర్వహణ ప్రదేశాలకు 144 సెక్షన్ అమలు చేయుట పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ వివరించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు నుండి ఎన్నికల ప్రచారం ముగిసిందని తెలిపారు. ఇక ఎలాంటి ప్రచారానికి తావులేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. ‘స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని, సోషల్‌ మీడియాలోనూ ప్రచారం నిషిద్ధం. టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధం. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో అవకాశం ఉందని, ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రదర్శనలు చేయరాదని, పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిషేధం. ఓటరు స్లిప్పుల్లో పార్టీల గుర్తులు, అభ్యర్థుల పేర్లు ఉండకూడదన్నారు. పోలింగ్‌ స్టేషన్లలో మొబైల్‌ అనుమతి లేదు’ అని కలెక్టర్ వెల్లడించారు

 

ఎన్నికల పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టామని అన్నారు.

ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించి ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని అన్నారు.

ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా నిత్యం ఎఫ్ఎస్ టి , ఎస్ ఎస్ టి బృందాలతో అను నిత్యం పర్యవేక్షించడం తో పాటు ప్రతి మండలానికి క్విక్ రెస్పాన్స్ టీం లను నియమించడం జరిగిందన్నారు.

మెదక్ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇందులో లో 2124 పోలింగ్ స్టేషన్లో 18,28210
ఓటర్స్ ఉన్నారని 1244లొకేషన్స్ ఉన్నాయని తెలిపారు.
ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ పంపిణీ చేయుటలో భాగంగా ఇప్పటివరకు 93% ఓటర్స్ కు అందించామన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించడం కొరకు కావలసిన 12 గుర్తింపు కార్డులు గురించి తెలియజేశారు.
ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం కొరకు జిల్లా కలెక్టర్ కేంద్రంలో సౌకర్యవంతంగా వినియోగించుకుంటున్నారని క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలు తలెత్తిన నివృత్తి చేసుకొని ఇప్పటివరకు
85 శాతం మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు .

ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పర్యవేక్షణ టీమ్స్ 24 గంటలు పాటు నిరంతరాయంగా పటిష్ట నిఘాలో ఉండాలని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తు.చ. తప్పక పాటించాలని, ఉల్లంఘన జరిగితే ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేసారు.కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించడానికి గల నిబంధనలు, కౌంటింగ్ ఏజెంట్ల నియామక నిబంధనలను,, ఆర్ ఓల బాధ్యతలు, మీడియా సెంటర్ ఏర్పాట్లు, సిసి కెమెరాల ఏర్పాటు, ఈవీఎంలను లను భద్రపరిచే స్ట్రాంగ్ రూం ఏర్పాట్లు , భద్రత చర్యలు, విడియో గ్రఫీ, ఫైర్ సేఫ్టీ చర్యలు, తదితర విషయాల పై కలెక్టర్ వివరించారు

ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇస్తున్నట్లు, కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూముల వద్ద ఎలా ఉండాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు, వీడియోగ్రఫీ చేయడం, పటిష్ట భద్రత చర్యలు, తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశామన్నారు.

పోలింగ్ నిర్వహణ సజావుగా జరిగేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాం పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

జిల్లా ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట పర్యవేక్షణ చేస్తూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 45 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో లాండ్ ఆర్డర్కు విఘాతం కలవకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అదనపు బలగాలు ,డిఎస్పి, సి ఐ స్థాయి నుంచి బందోబస్తు నిర్వహిస్తారని 48 గంటల పోలీసులు శాఖ అప్రమత్తంగా ఉంటుందన్నారు.మొత్తం 171 కేసులకు గాను 241 మందిని బైండోవర్ చేశామన్నారు.
ఈ ఎన్నికల్లో 88 లక్షల నగదు ,3,400 లీటర్ల మద్యం ,2000 క్వింటాళ్ల పీ డీ ఏస్ బియ్యం ను సీజ్ చేశామని మొత్తం రూపాయలు 1కోటి 45 లక్షల వరకు ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు, ఎన్నికల పర్యవేక్షకులు హరి దీప్ సింగ్
,ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking