మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి.

 

మెదక్, మే, 11.ప్రజాబలం న్యూస్ :

ఈనెల 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్ లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు మూడవ మరియు తుది ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఎన్నికల పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్ లను కేటాయించినట్లు
రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సమీర్ మాధవ్ కుర్కోటి సమక్షంలో మెదక్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్రాహుల్ రాజ్ ఎన్నికల సిబ్బంది కేటాయింపునకు సంబంధించిన మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వర్తించే ఎన్నికల సిబ్బంది జాబితాను ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆయా జిల్లాల కలెక్టర్లు కు అందజేశారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలోమైక్రో అబ్జర్వర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking