చీమలపాడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు పొంగులేటి పరామర్శ*

 

ఐదుగురు బాధిత కుటుంబాలకు రూ. 25 వేలు చొప్పున ఆర్థికసాయం

హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో గాయపడి హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు క్షతగాత్రులను ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం పరామర్శించారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. భవిష్యత్తులోనూ తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా గాయలబారి నుంచి కోలుకోవాలని దేవుడిని ప్రార్ధించారు. బాధితులను పరామర్శించిన వారిలో బొర్రా రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking