ఖమ్మం కతోలిక పీఠకాపరి పదవి బాధ్యతల స్వీకరణ చేపట్టిన పూజ సగిలి ప్రకాష్

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 9 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట విశ్వ కతోలిక శ్రీ సభ పాలకులు మహా పూజ్య ఫ్రాన్సిస్ పోపుగారు కడప పీఠానికి చెందిన గురువు పూజ సగిలి ప్రకాష్ ని ఖమ్మం నూతన పీఠాధిపతిగా నియమించి యున్నారు అభిషేక పుణ్య కార్యక్రమం ఘనముగా జరిగినది. హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారు ఈ ఘనమైన అభిషేక కాండను ప్రధాన యాజకునిగా ఉండి సహా అభిషేక పీఠాధిపతులుగా బిషప్ గాలి బాలి.

Pooja Sagili Prakash has taken over the post of Khammam Catholic Prefect

కడప పీఠానికి అధిపతి పాలనాధికారి మరియు బిషప్ ఉడుముల బాల .వరంగల్ పీఠాధిపతులు మరియు ఖమ్మం మేత్రాసన పాలానాధికారిచే ఈ కరుణగిరి పుణ్యక్షేత్రము బృహత్ దేవాలయ ప్రాంగణంలో దివ్య బలి పూజ లో,ప్రార్థనలతో మధుర, గానాలాపనలతో నిర్వర్తించినారు ఈ శుభ కార్యానికి పోపు ప్రతినిధి ఢిల్లీ నుండి హాజరైనారు వీరితోపాటు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఇతర రాష్ట్రాలకు చెందిన బిషప్పులతో పాటు వందల మంది పూజ పూజ గురువులు ,కన్యా స్త్రీలు, బ్రదర్స్ తో పాటుగా దాదాపు 12 వేల పైగా కతోలిక విశ్వాసులు భక్తులు పాల్గొన్నారు తద నంతరము బిషప్ సగిలి ప్రకాష్ కి ఖమ్మం పీఠకాపరులు పూజ్య బిషప్ లు కన్సల్టర్లు డీ న్లు, పూజ గురువులు మఠవాసులు బంధువులు ఆత్మీయులు ఎంతోమంది భక్తులు పూలమాలతో గజమాలలతో పరిమళ మోసగు పూ దండలతో దృశ్యాలవలతో ,ఘనముగా సన్మానము చేసినారుఈ కార్యక్రమానికి ముందుగా ద్విచక్ర వాహనముల ర్యాలీతో కొత్త బస్టాండ్ నుండి ఘనముగా వారిని ఊరేగింపుగా కరున గిరి పుణ్యక్షేత్రం వరకు దాని ముఖ ద్వారము నుండి పూజా వస్త్రధారణ అయిన వారిని మేళతాళములతో నృత్యములతో అభిషేక పుణ్యస్థలమునకు తోడుకొని వచ్చినారు .ఈ పవిత్ర కార్య ముగింపులో నూతన పీఠాధి పతులు అందరికీ దేవుని శుభాశీస్సులు పలుకుతూ హృదయమారా వందనములు అందజేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking