తూప్రాన్ చెరువు కట్ట పైన నాసిరకం పనులు

 

మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-

శిధిలావస్థలో సిమెంట్ గోడ మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పెద్ద చెరువు కట్ట పైన ప్రమాదకరంగా మారిన పరిస్థితి,
పట్టణంలో పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ పేరుతో కోట్లాది నిధులతో జరిగిన పనులన్నీ నాసిరకంగా కనిపిస్తున్నాయి. చెరువుకట్టకు కొత్త అందాల పేరుతో ఓవైపు ఇరిగేషన్ అధికారులు,
మరోవైపు కాంట్రాక్టర్లు కలిసి నాసిరకం పనులు చేసి చేతులు
దులుపుకున్నారు. చేసిన పనులే సరిగ్గా లేవంటే ఇంకా సుందరీకరణ పేరుతో మరిన్ని నిధుల మంజూరు కోసం నాయకులు ప్రయత్నిస్తున్నారు. చెరువు కట్ట పైన సిమెంటు నిర్మాణం పనులు పగుల్లతో పనుల తీరును వెక్కిరిస్తున్నాయి. వీరాంజనేయ స్వామి గుడి దగ్గరున్న మెట్ల వద్ద సిమెంటు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఐరన్ రాడ్లతో పటిష్టంగా కట్టాల్సిన గోడలను సిమెంటు,
కంకరరాళ్ళతో కలిపి వేయడం వల్ల కుంగిపోయి గోడలు బీటలు వారి కూలిపోయే స్థితికి చేరుకుంది. గోడ దగ్గర మట్టి కుంగిపోయింది వీరాంజనేయస్వామి గుడికి వచ్చే భక్తులు ఈ శిధిలావస్థలో ఉన్న గోడతో ప్రాణ సంకటంగ మారింది. హనుమాన్ మాలను ధరించిన స్వాములు ఇక్కడనే ఉంటుండడం వల్ల చెరువులోకి దిగే సమయంలో కాలుజారి ప్రమాదానికి గురయ్యే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అధికారులు తక్షణమే స్పందించి బీటలివారి ప్రమాదకరంగా మారిన సిమెంటు గోడ పరిస్థితులపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని తూప్రాన్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking