ముఖ్య అతిథి పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 10 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన ఆదర్శ రైతు బానోతు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక పెవెలియన్ గ్రౌండ్ లో కార్బైడ్ రహిత మామిడి మేళ ద్వారా ఖమ్మం నగర ప్రజలకు వివిధ రకాల మామిడిపళ్ళను సరసమైన ధరలకు అందజేస్తున్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య పాల్గొని ప్రారంభించారు . కార్బైడ్ రహిత మామిడి పండ్లను తినండి ఆరోగ్యానికి కాపాడుకోండి అని సందేశాన్ని ఇచ్చారు . ఈ సందర్భంగా ఆదర్శ రైతు బానోతు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ 2013 సంవత్సరంలో ఉన్న కలెక్టర్ సిద్ధార్థ జైన్ మరియు మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి హయాంలో ప్రారంభించామని . ఆ నాట్ నుండి ఈ నాటికి వర్కు ప్రజల ఆదరణతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలియపరిచారు . ఎలాంటి రసాయనిక పదార్థాలు వాడకుండా ట్రైలలో , రైఫినింగ్ చాంబర్ ద్వారా ఈ మామిడి పండ్లను పండించి అమ్ముతున్నామని . మా దగ్గర చిన్న రసం మామిడి పండ్లు , బంగినపల్లి పండ్లు , చెరుకు రసం , దశేరి , హిమాయత్ , పెద్దరసం , సువర్ణరేఖ , ఆల్ ఫన్ సో, మల్లిక , పచ్చడి మామిడికాయలు , తెల్ల గులాబీ , జలాలు , నీలం వంటి మరెన్నో నాటు రకాల మామిడి పళ్ళు లభిస్తాయి అని అతి తక్కువ ధరలకే వినియోగదారుల సంతృప్తి, వారి అభిరుచి మేరకు అన్ని రకాల మామిడిపళ్ళను అందుబాటులో ఉన్నాయన్నారు . 10కేజీలు కొన్నవారికి 1కేజీ (ఫ్రీ) ఉచితమని , సుమారుగా 45 రోజులు అందుబాటులో ఉంటామన్నారు . ఈ సంవత్సరం కాపు తక్కువగా ఉన్నందువలన కావున ప్రజలు త్వరపడి కొని మధురమైన మామిడిపండ్ల రకాలను ఆస్వాదించండి… అంటూ ఉత్తమ ఆదర్శ రైతు బానోత్ లక్ష్మణ్ నాయక్ మామిడి ప్రియులకు ఆహ్వానం పలికారు . మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్ ను 9908848371 సంప్రదించవలసినదిగా కోరారు
