మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 10:
రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు, ఎండా తీవ్రత ఎక్కువగా ఉండే సమయాలలో నేరుగా సూర్య కిరణాలూ తాకే స్థలాలలో పని చేసే వారు వడదెబ్బ కు గురి కాకుండా ఉండేలా నివారణ చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ లోని వి సి హాల్ లో బుధవారం జాతీయ కార్యక్రమం వాతావరణ మార్పు మరియు మానవ ఆరోగ్యంపై అనే అంశం పై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రఘునాథ స్వామి తో కలిసి అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య హాజరైనారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు, నేరుగా సూర్య కిరణాలూ తాకే స్థలాలలో పని చేసే వారు వడదెబ్బ కు గురి కాకుండా ఉండేలా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య, విద్య, డిసాస్టర్ మానెజ్మెంట్ అథారిటీ, వ్యవసాయ, పశు సంవర్ధక, పబ్లిక్ వర్క్స్, పర్యావరణ, కాలుష్య నివారణ, మున్సిపల్ కమీషనర్ శాఖల వారు సమన్వయంతో పని చేయాలన్నారు. వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు కూడళ్ల దగ్గర, పార్కుల వంటి స్థలాల వద్ద చలి వేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి త్రాగు నీటిని, చలి వేంద్రాలలో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. బయటికి వెళ్లే ప్రతి ఒక్కరు తలా పై టోపీ, టవల్ ధరించాలని, ఓ ఆర్ ఎస్ పౌడర్ కలిపిన నీటిని వెంట తీసుకువెళ్లాలని తెలిపారు. ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను యూ పి హెచ్ సి , పి హెచ్ సి కేంద్రాలకు ఏ ఎన్ ఎం, ఆశ వర్కర్లతో పంపిణి చేయించాలన్నారు. వడదెబ్బ తగిలిన వారికీ శీతల పానీయాలు కాకుండా , మంచి నీళ్లు, ఓ ఆర్ ఎస్ కలిపిన నీళ్లు వెంటనే త్రాగించాలి, నీడ ఉండే ప్రదేశాలలో ఉండేలా చూడాలన్నారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండే ప్రదేశాలలో నీడ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముగాజీవాలకు, పక్షులకు మంచినీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు. అనంతరం వడ దెబ్బ నుండి రక్షించుకుందాం అనే గోడ పత్రికను అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సాంబశివ రావు, డి ఏ ఓ రేఖ, డి జి డబ్ల్యూ ఓ రేవతి, డి డబ్ల్యూ ఓ కృష్ణ రెడ్డి, మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.