జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 27
ప్రభాస్ అభిమానుల ఎన్నో రోజుల నిరీక్షణకు తెరపడుతూ గురువారం రోజున విడుదలైన కల్కిఏడి సినిమా విడుదల సందర్భంగా కేక్ కటింగ్ చేసి ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు పేల్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ ఆలోచనలకు మించి సినిమా పెద్ద విజయం సాధించిందని అన్నారు. ఇలాంటిి అధ్బుతమైన చిత్రాన్ని ప్రభాస్ కి అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కి ప్రభాస్ కు అభిమానులు తరుపున ప్రత్యేక ధాన్యావధాలు తెలిపారు. అదేవిధంగా ఈ సినిమా కుటుంబం తో వచ్చి ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శివాజీ, మండల ఉపాధ్యక్షులు రాంప్రసాద్ రెడ్డి, ఇల్లంతకుంట అధ్యక్షులు అనిల్, రమేష్,సంపత్,లక్ష్మణ్, హరీష్,రవి, వంశీ,కిషోర్, వరుణ్, సుమన్, అజయ్ అభిమానులు పాల్గొన్నారు.