ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య,

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 9:
చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరూ
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమలుపై సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ డీఎఫ్ఎ శివరాం ఆధ్వర్యంలో జరిగిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ కుల వృత్తులను లాభదాయకంగా మార్చడం, కుల వృత్తి, చేతి
వృత్తిదారుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, మంగలి, రజక,వడ్డెర, ఔసలి, కంసాలి, దర్జీ వంటి చేతివృత్తులపై ఆధారపడి జీవించే వారికి ఈ పథకంలో ఆర్థిక సాయం అందిస్తారన్నారు. లబ్ధిదారులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం, రేషన్కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలతో డాక్యుమెంట్లు, ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ జత చేసి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈడీ కార్యాలయంలోని కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌, pmviswakarma. gov.in వెబ్‌సైట్‌ నందు సంప్రదించాలని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులకు 5 శాతం వడ్డీతో రూ. 3లక్షల వరకు రుణ సహాయం అందించనున్నట్లు తెలిపారు.అనంతరం హైదరాబాద్ బాలానగర్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా మంత్రిత్వ శాఖ డీఎఫ్ఎ శివకుమార్ విశ్వకర్మ పథకం ప్రాముఖ్యత, ప్రయోజనాలు, ఆన్లైన్లో నమోదు చేసుకొనే విధానాలపై అవగాహన కల్పించారు.
అధికారులు స్వయం సహాయక సంఘ సభ్యులు జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు గ్రామపంచాయతీ అందరి అధికారుల సమన్వయంతో ప్రచారం చేయడం వల్ల ఈ పథకం ఎంతోమందికి చేదోడుగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి , జిల్లా పంచాయతీ అధికారి కల్పన, డి ఆర్ డి ఓ సంపత్ రావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారిని పుష్పలత, పీఎం విశ్వకర్మ యోజన సెంట్రల్ గవర్నమెంట్ డొమెన్ ఎక్స్పర్ట్స్
రాజేశ్వరరావు శ్రీధర్, పెద్దూరి రాజు సంబంధిత
18 రకాల చేతి వృత్తిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking