హెల్మెట్ ఒక వస్తువు కాదు ప్రాణాన్ని కాపాడే రక్షణ ఆయుధం.

 

ఒక్కో సీ.సీ కెమెరా 100 మంది సిబ్బంది నేత్రాలతో సమానం.జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా బుధవారం నిర్మల్ జిల్లా అక్కపూర్ గ్రామంలో హెల్మెట్ యొక్క ఉపయోగాల గురించి అవగాహన మరియు (11) సిసి కెమెరా ప్రారంభించారు.ఇట్టి కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల.ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి ర్యాలీలో పాల్గొని అనంతరం పాఠశాల విద్యార్థులచే హెల్మెట్ అవగాహన ర్యాలీ అక్కపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ. మాట్లాడుతూ.ప్రతి మోటార్ సైకిల్ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకుండా చాలామంది మోటార్ సైకిల్ వాహనదారులు తరచుగా మరణించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంబడి ఉంచుకోవాలని, త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. మోటార్ సైకిల్ వాహన చోదకులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని,హెల్మెట్ మా శాసనం కాదు మీ సంక్షేమం,హెల్మెట్ ఒక వస్తువు కాదు ప్రాణాన్ని కాపాడే ఆయుధం, రోడ్ చిన్నదైనా, పెద్దదైనా పడితే ప్రమాదమే ఆదమరిస్తే విషాదమైన ఎక్కడైనా ఎప్పుడైనా చిన్నవారైనా, పెద్దవారైనా ప్రమాదం పొంచి ఉన్నదని ఎవరికెరుక అందుకే ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రజలందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.ఈ సందర్భంగా అక్కాపూర్ గ్రామంలోని యువతకు లైన్స్ క్లబ్ యాజమాన్యం సమకూర్చిన హెల్మెట్లను ఎస్పీ గారి చేతుల మీదుగా అందజేసినారు. 24X7 గంటలు 365 రోజులు నిర్విరామంగా నిరంతరాయంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయని తెలిపినారు. మహిళల, ప్రజల రక్షణకు దొంగతనాలు అరికట్టడానికి పట్టణాలలో, గ్రామాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ఉపయోగపడతాయి తెలిపారు. వ్యక్తుల కదలికలను పరిశీలించడానికి ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలను ఎంతోగానో ఉపయోగపడతాయన్నారు. ఒక్కో సీ.సీ కెమెరా 100 మంది సిబ్బంది నేత్రాలతో సమానం,సీసీ కెమెరాలు నిరంతరం నిఘాలో ఉండి 100 మంది సిబ్బంది చేసే పని ఒక్క సీసీ కెమెరా చేయగలుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి, ఏం వి ఐ అజయ్ కుమార్ రెడ్డి, గ్రామీణ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రభూషణ్, లైన్స్ క్లబ్ అధికారులు, గ్రామ సర్పచ్, ఉపాద్యాలు, పాఠశాల విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking