సిరిసిల్ల ప్రజాబలం ప్రతినిధి:వెములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ప్రజాబలం తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించినారు.ఈ సందర్భంగా ఆదిశ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాబలం దినపత్రిక దినదినాభివృద్ది చెందాలని ప్రజాసమస్యలను ప్రభుత్వానికి చేరవేయాలని ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రభుత్వ పథాకాలు అర్హులైన రైతులందరికి ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ మరియు రైతుబంధు మహిళలకు ఉచిత బస్సు గృహాజ్యోతి కింద 200యూనిట్ల కరెంట్ ఉచితంగా అందివ్వడం.500లకే గ్యాస్ సిలిండర్ అందివ్వడం గత 10సంవత్సరాలుగా నిరుద్యోగుల బాధఅర్ధం చేసుకుని నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించడంలో ముందుంది.ఒక్క సంవత్సరంలోనే ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యింది.ఈ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేర వేయడంలో పత్రికలు ముఖ్యభూమిక నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాబలం దినపత్రిక సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జి.ఆంజనేయులు దుబ్బాల బుచ్చిరాజు,మెరుగు రమేష్ తదితరులు పాల్గోన్నారు.